Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేవరకు పోరాటం ఆగదు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేవరకు పోరాటం ఆగదు

- Advertisement -

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 
నవతెలంగాణ – ఆలేరు 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఆగదని ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో శుక్రవారం నాడు బీసీ జేఏసీ  ఆధ్వర్యంలో జరిగిన ధర్మ దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు కట్టుబడి ఉందన్నారు అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రాన్ని పంపితే బిజెపి ప్రభుత్వం ఆమోదం తెలపకుండా రాష్ట్రంలో ఒక మాట కేంద్రంలో ఒక మాట మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను వంచిస్తుందని విమర్శించారు.ఉద్యమాల గడ్డ ఉస్మానియా అడ్డా అని తెలంగాణ రాష్ట్రంలో సిద్ధించడానికి ఉస్మానియా విద్యార్థుల పోరాటం మరువలేనిదన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తూ మధ్యలో విరమించుకుంటే ఉస్మానియా విద్యార్థులు వెంటపడి  దీక్ష కొనసాగే విధంగా హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు.రాష్ట్ర ఆవిర్భావం కోసం ఏ విధంగా  ఉస్మానియా విద్యార్థులు ఉంచారు. బిసి రిజర్వేషన్లకు మల్లొకసారి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.బీసీలు వెనుకబడిన వారు కాదని వెనకకు నెట్టి వేయబడ్డ వారు అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసి అయినప్పటికీ 42 శాతం బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లు పెట్టి బీసీల పట్ల కాంగ్రెస్కు ఉన్న చిత్తశుద్ధిని చాటారన్నారు.బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ తో పాటు ఉస్మానియా క్యాంపస్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -