Thursday, November 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో' సందడి షురూ..

‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ సందడి షురూ..

- Advertisement -

హీరో రామ్‌ పోతినేని నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 28న థియేటర్లలోకి రానుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర ఆన్‌-స్క్రీన్‌ సూపర్‌స్టార్‌ పాత్రను పోషిస్తున్నారు. వివేక్‌- మెర్విన్‌ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. మొదటి మూడు ట్రాక్‌లు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి.

మేకర్స్‌ ఫోర్స్ట్‌ సింగిల్‌ – ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను అభిమానులు విమల్‌ థియేటర్‌లో గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఈ లాంచ్‌ ఈవెంట్‌కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ హీరో రామ్‌ కటౌట్‌ను లాంచ్‌ చేశారు. అసలైన సినిమా మ్యాజిక్‌ అభిమానులు తమ అభిమాన స్టార్లని సెలబ్రేట్‌ చేసుకునే మూమెంట్స్‌లోనే ఉంటుంది. సినిమా పట్ల అభిమానుల ఇష్టం, ఆ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో అనుభూతిని ఈ పాట ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చూపించింది. దినేష్‌ కాకర్ల రాసిన సాహిత్యం అభిమానుల ప్రేమ, ఆత్రుత, అంకితభావాన్ని ప్రతీ లైన్‌లో చూపిస్తుంది అని చిత్ర బృందం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -