నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గా గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా విశాలాక్షి పటేల్ తమ బాధ్యతలు చేపడుతూ పంచాయతీ కార్యాలయంలో వాసంతి పంచమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచాయితీ పాలకవర్గం మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ మొదటి సమావేశంలో గ్రామంలోని వీధిలైట్ల ఏర్పాటు మురికి కాలువల శుభ్రత త్రాగునీటి సమస్య తీర్చే విధంగా ముఖ్యంగా చర్చించినట్లు ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు అదే విధంగా గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శి పాలకవర్గం సభ్యులు పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన కార్యక్రమంలో సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలకమండలి చైర్మన్ రామ్ పటేల్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
సర్పంచ్ విశాలాక్షి పటేల్ అధ్యక్షతన మొదటి సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



