వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – మల్హర్ రావు
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డా బండా ప్రకాష్ ఆదేశాల మేరకు ఈ నెల 21న నిర్వహించే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ జిల్లా యూత్ ఉపాద్యక్షుడు ముద్రవేని సురేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల పెద్దమ్మతల్లి ఆలయంలో ముదిరాజ్ మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. బీసీలకు 42%రిజర్వేషన్లు అమలు చేసి ముదిరాజ్ జనాభాకు తగ్గట్టుగా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అక్కినవేని సమ్మయ్య, ఉపాద్యక్షుడు ఇండ్ల మహేందర్, ప్రధాన కార్యదర్శి చొప్పరి రాజు, తాడిచెర్ల సోసైటి చైర్మన్ బోనగిరి ఒదేలు, ఆకుల నర్సింగం, శ్రీనివాస్, రాజేషం, రాజయ్య,బొంతల శంకర్,కుంట భూమయ్య పాల్గొన్నారు.
పల్లె పల్లెకు ముదిరాజ్ జెండా.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



