సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి పరీక్షల మధ్య అంతరాన్ని తగ్గించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మేరకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డిని శనివారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఒక పరీక్ష తర్వాత మరో పరీక్షకు ఐదు రోజుల వ్యవధి ఉందని తెలిపారు. ఈ అంతరాన్ని తగ్గించాలని కోరారు. ఒక పరీక్షకు ఇంకో పరీక్షకు మధ్య వ్యవధి ఐదు రోజులు ఉండడంతోపాటు మొత్తం పరీక్షలు పూర్తి కావడానికి నెల రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థులు అధిక భారంగా చూస్తున్నారని తెలిపారు. కావున ఆ వ్యవధి తగ్గించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ సీఎంవో కార్యదర్శి అజిత్‌రెడ్డిని ఈ అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన వారిలో పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పుల్గం దామోదర్‌రెడ్డి, ఆడిట్ కమిటీ చైర్మెన్ సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ పరీక్షల మధ్య అంతరాన్ని తగ్గించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



