తోటమాలి మాలిమి ప్రేమను పూయించి, సుగంధాల కవితలను వెదజల్లి, గేటు బయట ఉన్నవారిని లోనికి రమ్మంటూ తోటలోని అక్షరాల కవితా లతలని చూడండి అంటూ పిలుస్తున్నట్టు అనిపిస్తుంది.
డా. విద్యాధర్ గారు 40 సంవత్సరాలుగా సాహిత్య వ్యవసాయం చేస్తూ, అన్ని రకాల వంగడాలను తన అక్షరాల గింజలతో పండిస్తూ, అతిరధ మహారథుల ప్రశంసల వెల్లువలో గర్వం అనే పదాన్ని తన డిక్షనరీలో కనిపించనీయక అందరితో స్నేహభావంతో మెలుగుతారు. పుస్తకం వెనక ఆయన తన మొదటి కవిత తోటమాలి మాలిమి వేశారు. చదివిన వారికి ఆయన గొప్పతనం తెలుస్తుంది.
”పరిమళాలు ఊరికే రావు/ పరవశాలు లోలోపల పగలకుండా..” నిజమే కదా ! ఎంతటి భావుకతతో కూడిన కవిత్వమో అనిపించక మానదు. మిగిలిన కవితలు చదవాలనే తలంపు రాక మానదు. కవితలన్నీ లోతైన భావుకతతో నిండి ఉన్నాయి. ఇహ పుస్తకం లోపలికి వెళితే, ‘హదయపు కోవెలలో నీవు’ మంత్రదండం, నన్నేం చేస్తావో నీవే చెప్పు అంటూనే, ‘దీపపు పురుగులు కూడా కనులతో మాటలాడునని, నేనొక నీలిగగనంపై తోక చుక్కనై’ అంటూ విశ్వంలోని చుక్కల గురించి వివరిస్తూ తన భావుకత్వంలో ముంచేసారు.
‘ఒంటరి దీపపు స్థంభంలా తల్లి భాషకి రసానందధ్యతి ఇచ్చుటలో ఉన్న హాయి నీకు తెలుసా అంటారు. నా పరి వేదనే నీకు నివేదన చేస్తూ ఆ ఒక్కటి ఒద్దురా! నిజాయితీగా జీవితమంతా సాగిపో, నీవు నీలాగే ఉండాలి, అందరినీ తట్టి లేపి మేల్కొలుపు, అప్పుడు నీవు నీలాగా విశ్వమానవ ప్రేమ పంచేరు. మువ్వన్నెల వెన్నెలా నన్నిసారి గెలిపించవూ, నిన్ను కోరని వర్ణం నేను, గబ్బిలమా నన్ను వదలిపో, మదిలో దాగిన వెన్నెలా ఒకసారి కనిపించవూ’ అని అడిగిన తీరులో కవితలు మనసుని అల్లుకుపోతాయి.
‘అల్లుకున్న తాటల్లితల అనుమతి నా తరమా అంటే ఇదంతా స్మార్ట్ ఏమి కాదు గురూ! అంటారు.సముద్రమంత సౌందర్యం గురించి వర్ణించిన తీరు మీకు చాలా గ్రేట్ అనిపించక మానదు. తేనె నీటి సరస్సులో ఎవరు కాదన్నా, అవునన్నా అటెన్షన్ డైవర్టెడ్ అవ్వాల్సిందే. నేను దేవతని చూశాను అంటారు. ఆవిరైన స్వప్న సముద్రంలో ఒక్కోసారి అంతే మరి. శరణు దేవి శరణు అని జలతారు వెన్నెల్లో విహరింపజేసి తెలిమంచు తెరల దశ్యం ముందుంచుతారు.
ఘనీభవించే కాలమిది. క్షణమైనా లయమేనా? లయబద్దంగా ఏదో మరేదో కదిలించేది ఇంకేదో! అని మన హదయాలని ఎక్కడికో తీసుకు వెళతారు. పాదముద్రలు పడని ప్రాంతంలో ఏ మార్చగలవ్! ఏ మార్చగలవ్ అని నేనేమి కవిత్వం రాయలేదు. నేనో సమాజ స్థాపకుడ్ని. అలా సాగిపోతూ ఆసాంతం మనల్ని 75 కవితలకు అతుక్కు పోయేటట్లు చేశారు.అంతటి భావుకత నిండిన తోటమాలి మాలిమి అందరూ చదవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
– పి.విశాలాక్షి, సికింద్రబాద్
ప్రేమను పూయించిన తోట మాలిమి
- Advertisement -
- Advertisement -



