దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలి నేని ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు.
ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రష్మిక, దీక్షిత్ శెట్టిపై పాట చిత్రీకరిస్తున్నారు. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయ్యింది.
త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ చిత్రంలోని పాటను ఈ నెలలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – కష్ణన్ వసంత్, సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్, ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకష్ణ, మౌనిక నిగోత్రి.
భిన్న ప్రేమకథతో ‘ది గర్ల్ ఫ్రెండ్’
- Advertisement -
- Advertisement -