- Advertisement -
నవతెలంగాణ_ ఆత్మకూరు: అమర చింత మండల కేంద్రంలో గురువారం రాత్రి మండల తాసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో మండల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 36 చెక్కులను పంపిణీ చేశారు ,కొత్త రేషన్ కార్డులు , ఉన్న కార్డులలో అదనంగా చేర్చినవి 1,786 కార్డులో మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దారు రవికుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కే.నాగరాజు గౌడ్, అయూబ్ ఖాన్, మహేందర్ రెడ్డి ,అరుణ్ కుమార్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -