ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసులు సేవ చేయడం అభినందనీయం
ఆర్ పి ఎఫ్ బాధితులు ఫిర్యాదు చేస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం
వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్
నవతెలంగాణ – పాలకుర్తి
నేర రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం పాలకుర్తి పోలీస్ స్టేషన్ ను జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ తో కలిసి సందర్శించి పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను సందర్శించి పరిశీలించిన అనంతరం పోలీస్ సిబ్బంది కిట్టు బాక్సులను పరిశీలించారు. పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందించేందుకు త్రాగునీటి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నేరాలను నివారించడంలో పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ప్రజల రక్షణ కోసం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నారని తెలిపారు.
పోలీస్ సిబ్బంది పనితీరుతో పాటు పోలీస్ స్టేషన్ నిర్వహణ, నేరాలను నియంత్రించడంలో పోలీసుల పాత్ర, నేరాల పట్ల పోలీసులు చేపడుతున్న విచారణల పట్ల సంతృప్తికరంగా ఉందని తెలిపారు. డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. పని విభజనలో సమన్వయంతో పనిచేయాలని, ఎస్సై లందరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరించిన, కొత్త వ్యక్తుల పట్ల అనుమానం వచ్చిన స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ప్రజల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేరాలను నివారించడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎసిపి అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ వంగాల జానకి రమ్ రెడ్డి, ఎస్సైలు దూలం పవన్ కుమార్, మేకల లింగారెడ్డి, ఎండి యాకూబ్ హుస్సేన్ లతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని మంచుప్పుల గ్రామానికి చెందిన దళిత కుటుంబాలను గత రెండు సంవత్సరాల క్రితం కుల బహిష్కరణ చేయడంతో దళితులు సిపి సన్ ప్రీత్ సింగ్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కుల బహిష్కరణ కు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని దళితులు కోరారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సిపి హామీ ఇచ్చారు.
నేర రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES