Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వంద గంటల్లో నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యం 

వంద గంటల్లో నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యం 

- Advertisement -

లైజన్ జిల్లా అధికారి విజయ్ కుమార్ రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి

వంద గంటల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యమని లైజన్ జిల్లా అధికారి విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో వయోజన విద్య, విద్యాశాఖ ఆధ్వర్యంలో వివో ఏ లకు, ఉపాధ్యాయులకు సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఉల్లాస్ శిక్షణ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య తో కలిసి ఆయన మాట్లాడుతూ పాలకుర్తి మండలంలో 2600 మంది నిరక్షరాస్యులు ఉన్నారని తెలిపారు. నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంతో పాటు జీవన నైపుణ్యాలు పెంపొందించే విధంగా ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు.

గ్రామాల్లో ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు ఒక్కొక్కరు పదిమందిని బాధ్యతగా తీసుకొని అక్షరాస్యుల్ని చేయాలని సూచించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 15 సంవత్సరాలు దాటిన నిరుద్యోగ యువతీ యువకులకు ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించేందుకు పాలకుర్తి లోనే ఓపెన్ టెన్త్, ఇంటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నిరుద్యోగ, యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రమేష్, టాస్ ఇంచార్జి రవి, ఆర్పీలు శ్రీనివాస్, క్రాంతి కుమార్, సీసీలు కారు పతుల వెంకటేశ్వర్లు గౌడ్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad