లక్ష్మయ్య వర్థంతి కార్యక్రమంలో
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బ్రిటీష్ ప్రభుత్వంతో పోరాడి ఉపాధ్యాయుల కోసం సంఘం పెట్టుకునే స్వేచ్ఛను సాధించి ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్‌ను స్థాపించిన ఉపాధ్యాయ ఉద్యమ పితామహుడుగా చరిత్రలో నిలిచిన నేత చెన్నుపాటి లక్ష్మయ్య అని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే యూటీఎఫ్ కార్యకర్తల లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన చెన్నుపాటి లక్ష్మయ్య వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకట్ మాట్లాడారు. బ్రిటీష్ నియంతృత్వాన్ని ఎదురించి ఉపాధ్యాయ ఉద్యమం కోసం పోరాడిన నేతగానే కాకుండా సామాజిక స్పృహతో ప్రజల కష్టాల పట్ల కూడా చెన్నుపాటి పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు నేడు పొందుతన్న పెన్షన్, ఇంక్రిమెంట్లు, నెలనెలా జీతాలు తదితర అనేక సౌకర్యాలను పోరాటాల ద్వారా సాధించిన ఉద్యమ నేత చెన్నుపాటి అని తెలిపారు. నేటి పాలకులు అవలంబిస్తున్న విధానాలు కూడా బ్రిటీష్ పాలనను పోలి ఉన్నాయనీ, అందుకే చెన్నుపాటి చూపిన బాటలో పోరాటం చేయాలని సూచించారు. ప్రభుత్వ తిరోగమన విధానాలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు ఎస్‌టీఎఫ్‌ఐ పూర్వ ఉపాధ్యక్షులు యం.సంయుక్త మాట్లాడుతూ మానవ సంబంధాలు నిలపడంలో, విద్యా ప్రయివేటీకరణను వ్యతిరేకించడంలో ప్రజలతో ఉపాధ్యాయులు సత్సంబంధాలు కలిగి ఉండడం లాంటి లక్షణాలు చెన్నుపాటి నుంచి నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పత్రిక ప్రధాన సంపాదకులు పి.మాణిక్‌రెడ్డి, ప్రచురణల కమిటీ కన్వీనర్ యస్.వై.కొండల్‌రావు, సీనియర్ నాయకులు డి.మస్తాన్‌రావు, ఇంద్రజిత్, యన్.రమేష్, నరసింహారెడ్డి, యం.వెంకటేశ్వర్లు, టాప్రా ఉపాధ్యక్షులు అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
చెన్నుపాటి ఆశయాల కొనసాగింపే ఉద్యమ లక్ష్యం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



