Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుడిసెలు లేని గ్రామాలను తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

గుడిసెలు లేని గ్రామాలను తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

ఇండ్ల నిర్మాణ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ – మద్నూర్

ఏళ్ల తరబడి ఎదురుచూసే అర్హులైన నిరుపేదలకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, మాట్లాడుతూ..పూర్తిగా వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గం లో అర్హులైన నిరుపేదలు ఏండ్ల తరబడి ఇండ్ల మంజూరు కోసం ఎదురు చూసినప్పటికీ, గత ప్రభుత్వం 10 ఏండ్ల కాలం పాటు అధికారంలో కొనసాగిన ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదని అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తోట లక్ష్మీ కాంతారావు అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆదుకుంటున్నారని అన్నారు. గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వారు పేర్కొన్నారు. మద్నూర్ మండలంలోని చిన్న తడగూరు గ్రామంలో నిరుపేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులు కలిసి భూమి పూజ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -