జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామ పాలన అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రామ పాలన అధికారుల కౌన్సెలింగ్ లో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని,అభ్యర్థి సొంత నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గంలో ఖాళీల జాబితా ప్రదర్శిస్తూ వారి ఐచ్చికాల మేరకు పోస్టింగ్ లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. నియామక పత్రాలు తీసుకున్న గ్రామ పాలన అధికారులు భాద్యతగా విధులు నిర్వహించాలని ఈ సందర్బంగా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారమే గ్రామ పాలన అధికారుల లక్ష్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES