ఉచిత విద్యుత్ పెండింగ్ బకాయి బిల్లులను వెంటనే విడుదల చేయాలి..
నవతెలంగాణ – భువనగిరి
రజక ఫెడరేషన్కు పాలకవర్గాన్ని వెంటనే నియమించాలని, ఉచిత విద్యుత్తు బకాయి బిల్లులను విడుదల చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎదునూరి మదర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక టీఎన్ జీవో భవనంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు అవనగంటి స్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో వృత్తి ఆధునికరణ ఉపాధి కల్పనకు మోడ్రన్ ధోబిఘాట్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి సంవత్సరం పూర్తయిన హామీని నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందన్నారు.
దోబిఘాటు స్థలాలను కాపాడటానికి పెండింగ్ ఉచిత విద్యుత్ బకాయి బిల్లును వెంటనే పూర్తిస్థాయిలో విడుదల చేయాలని, ప్రత్యేకంగా ప్రహరి గోడలు నిర్మించాలని కోరారు . వృత్తిదారులు బట్టలు తీసుకురావడం కోసం మోఫైడ్ వాహనాలు అందించాలన్నారు. రజక ఫెడరేషన్కు వెంటనే పాలకవర్గాన్ని నియమించాలన్నారు. బడ్జెట్ను విడుదల చేయాలన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలను వెంటనే మంజూరు చేయాలన్నారు. నూతనంగా ఉచిత విద్యుత్ పథకం ఆన్లైన్ యాప్ ని తెరిపించి కొత్త వాళ్లకు కరెక్షన్లు ఇవ్వాలన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ మాట్లాడుతూ ఆలేరు మోత్కూర్ లో మోడరన్ దోబిఘాట్లు అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రంలోని ధోబిఘాట్లకు ప్రహరీ గోడ నిర్మించాలన్నారు. వాటికి అవసరమయ్యే నిధులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. ఉచిత విద్యుత్ పథకం లో జిల్లావ్యాప్తంగా పెండింగ్ బకాయి బిల్లులు ఒక్కో వృత్తిదారుడుపై రూ. 30 వేల నుండి రూ. 80,000 వరకు బకాయిలు ఉన్నాయన్నారు.
వెంటనే పెండింగ్ బకాయి బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు 50యేండ్లు పైబడిన వృత్తిదారులందరికీ పెన్షన్ పథకం ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు వడ్డేమాన్ బాలరాజ్, జిల్లా సహాయ కార్యదర్శిలు వడ్డెమాను రవి, బొడ్డుపల్లి సతీష్, జిల్లా సలహాదారులు బాతరాజ్ యాదయ్య, ఎలిమినేటి నగేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎలిమినేటి మురళీకృష్ణ, భువనగిరి శ్రీనివాస్ ,పొన్నఉప్పలయ్య, వడ్లకొండ రమేష్ ,పేడకంటి లింగస్వామి, గరిసే నరసింహ ,పహాడాల బిక్షపతి, దాల్షిరాము యాదగిరి కూసంపల్లి యాకూబ్ పాల్గొన్నారు.