బొజ్జ హేమంత్ ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు
నవతెలంగాణ – పరకాల
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ హేమంత్ అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోగిల సాయి తేజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నూతన కమిటీల నిర్మాణా కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ హేమంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను అనేక రకాలుగా మోసం చేస్తూ వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టలేక దొంగ హామీలతో సమయం గడుపుతుంది అని అలాగే ప్రభుత్వ కాలేజీల్లో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను పట్టించుకోవడం లేదన్నారు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు.
అలాగే హాస్టల్స్ సొంత భవనాలు నిర్మించి బాత్రూమ్స్ నిర్మించాలన్నారు మధ్యాహ్న భోజనం అమరలోకి తీసుకురావాలన్నారు పెరిగిన బస్ పాస్ చార్జీలను తగ్గించి దూరం నుండి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యాలు కల్పించాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు అన్నారు ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నియమించి విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు లేనియెడల రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అనేక రకాల ఉద్యమాలు ధర్నాలు చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నూతన కమిటీ కాలేజీ అధ్యక్షుడు కే ప్రభాస్, రాహుల్ , సత్య తేజ కార్యదర్శి అజయ్, అవినాష్, రోహిత్,బాలికల కమిటీ నుండి కాలేజీ అధ్యక్షులు నవ్య శ్రీ , నందిని, సహజ కార్యదర్శి అఖిల అమూల్య, రుచిత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను మోసం చేస్తున్న ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES