Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యుఎస్పీసీ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి

యుఎస్పీసీ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్ పిసి) విన్నవిస్తున్న ఉపాధ్యాయ, విద్య రంగ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కమిటీ బాధ్యులు బుధవారం మండల మెజిస్ట్రేట్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుఎస్ పిసి కమిటీ బాధ్యులు గుమ్మడివెళ్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలను సవరించి 40 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని, సర్దుబాటు పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టి, బడి ఈడు పిల్లలు ప్రైవేటుకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్ గ్రాంట్లు విడుదల చేయాలన్నారు. పెండింగ్ బిల్లులు, కరువు భత్యాన్ని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల పెన్షనర్ బెనిఫిట్స్ ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించారు. పిఆర్సిని వెంటనే అమలయ్యేలా చూడాలని ఉపోద్ఘాటించారు. 2003 డిఎస్సి ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మోడల్ స్కూల్, గురుకుల ఉపాధ్యాయులకు కూడా వర్తింపచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ బాద్యులు మల్లేశం, కరుణాకర్, రాంరెడ్డి, శ్రీధర్, సతీష్, రమేష్, శ్రీనివాసులు, మురళి, నరేష్, వివేక్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -