Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సర్కార్ స్థలాన్ని కాపాడాలి..

సర్కార్ స్థలాన్ని కాపాడాలి..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ లోని వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనిలో కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాన్ని కాపాడాలని కాలనీ నివాసదారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు దాసరి లక్ష్మి నర్సయ్య,ప్రధాన కార్యదర్శి బాలసింగ్ నాయక్ చౌహన్,ఉపాధ్యక్షుడు కంచెట్టి లక్ష్మ న్, సహాయ కార్యదర్శి రేకులపల్లి కమలాకర్ రెడ్డి,కోశాధికారి ఏనుగు హన్మంత్ రావు,సలహాదారు, ఇంజనీర్ ఎస్. శివలాల్ తదితరులు బుధవారం నాడు నుడ చైర్మన్ కేశ వేణు ను కలిసి ఫిర్యాదు చేశారు.వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ ఎల్ఐజి ఇండ్లకు పక్కన 2500 గజాల విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

కాలనీ వాసుల భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన 2500 గజాల స్థలంలో కొందరు ప్రవేట్ వ్యక్తులు కార్ గ్యారేజ్ అవసరాల కోసం వాడుకుంరున్నారని సంక్షేమ సంఘం నేతలు కేశ వేణు దృష్టికి తెచ్చారు..పార్క్ కోసం వినియోగించడానికి వీలుగా చెట్లు పెంచి ప్రజలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నాలను ప్రయివేటు వ్యకులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు.. ఖచ్చితమైన కొలతలు నిర్వహించి 2500 గజాల స్థలం చుట్టూ కంచె వేసి ప్రజల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల చెర నుండి విడిపించాలను వారు నుడ చైర్మన్ ను కోరారు. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుపై కేశ వేణు స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడిన నుడ చైర్మన్ హౌసింగ్ బోర్డు లో ఖాళీ స్టలంను పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad