Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి 

ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి 

- Advertisement -

ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్
విద్యాసంస్థల బంధు విజయవంతం
నవతెలంగాణ – పరకాల 

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేశారు. బుధవారం అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంధువులకు విజయవంతమైంది. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బందు పిలుపుకు సహకరించాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్ఇపి-2020 పాలసీని తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు.అంతేకాకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనేక మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతుందన్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మొదలుకి సదుపాయాలు కల్పించి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఎంఇఓ, డిఇఓ పోస్టులు భర్తీ చేయాలన్నారు.

ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలన్నారు.విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని,విద్యార్థులకు ఆర్టీసిలో ఉచిత బస్పాసులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్, లెక్చరర్ పోస్తులు భర్తీ చేయాలని లేనట్లయితే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ  మండల అధ్యక్షుడు మడికొండ మడికొండ ప్రశాంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, వంశీ ,మహేష్ ,రంజిత్, కృష్ణ ,సురేష్ , శాంతి ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -