Tuesday, July 22, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్దిగొచ్చిన ప్రభుత్వం

దిగొచ్చిన ప్రభుత్వం

- Advertisement -

జీవో నెంబర్‌ 49 నిలుపుదల – అధికారులకు సీఎం ఆదేశం
ఆదివాసీ గిరిజన సంఘాల పోరాట ఫలితం : టీఏజీఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కొమరం భీం కన్జర్వేషన్‌ కారిడార్‌ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవో నెంబర్‌ 49 అమలును నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ జీవోపై రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ గిరిజన ప్రజలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జీవోను రద్దు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంతో పాటు ఇతర గిరిజన సంఘాలు జేఏసీగా ఏర్పడి వివిధ రూపాల్లో ఉద్యమాలు నిర్వహించాయి. టీఏజీఎస్‌ ఆధ్వర్యంలో జీవో కాపీల దహనం కార్యక్రమంతో పాటు ఎమ్మా ర్వోలకు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిం చారు. జూన్‌ 30న ఐటీడీఎలను ముట్టడిం చారు. సోమవారం సీపీఐ(ఎం), ఆదివాసీ సంఘాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనలో ఆదివాసీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆది వాసీ గిరిజనుల్లో పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన ప్రభుత్వం ఈ ఏడాది మే 30న విడుదలచేసిన జీవో 49ని నిలుపుదల చేస్తు న్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీం మెమో జారీ చేశారు.

ఉద్యమాల వల్లే…
ఆదివాసీల పోరాటం ఫలితంగానే జీవో 49ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని తెలం గాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిడియం బాబూరావు, పూసం సచిన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై మెమో జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలోని ఆదివాసీ చట్టాలని, ప్రజల హక్కులను కాలరాస్తూ అటవీశాఖ ఈ జీవోను తెచ్చిందని గుర్తు చేశారు. అయితే గిరిజనుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావటంతో తాత్కాలికంగా నిలుపుదల చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జీవో నిలుపుదలతో సమస్య పూర్తిగా పరిష్కరమైనట్టు కాదనీ, దాన్ని రద్దు చేసేవరకు ఆదివాసీ గిరిజనులు అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలని కోరారు.
అప్పటి వరకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్‌) పోరాడుతుందని స్పష్టం చేశారు.

సీఎంను కలిసిన ఆదివాసీ ఎమ్మెల్యేలు .. మంత్రి సీతక్క హర్షం
జీవో 49ని నిలుపుదల చేయడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, ఎమ్మెల్సీ దండే విటల్‌, మాజీ ఎంపీ సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్‌ డీసీసీి అధ్యక్షులు విశ్వప్రసాద్‌ ఇతర నేతలతో కలిసి ఆమె సీఎం రేవంత్‌రెడ్డిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తడోబా టైగర్‌ రిజర్వ్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లను కలిపేందుకు వాటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కన్సర్వేషన్‌ రిజర్వ్‌గా ఏర్పాటు చేసేందుకు 2016 జూన్‌ 12న అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంకు ర్పార్పణ చేసిందని తెలిపారు.

అయితే ఈ జీవోపై స్థానిక ప్రజలు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేయడంతో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలతో సంక్షేమ భవన్‌లో జూన్‌ 10, 2025 సమావేశమై జీవో 49 ను నిలిపి వేయాలని నిర్ణయించినట్ట్టు తెలిపారు. సీఎంను ప్రత్యేకంగా కలిసి స్థానిక ప్రజల ఆకాంక్ష లను వివరించామని గుర్తు చేశారు. మరో వైపు మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్‌ జిల్లా ఇంచార్జ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీ అధికారులు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలతో 2025 జులై 3న సమావేశమై మరో సారి చర్చించి జీవో 49 ని నిలుపుదల చేయాలని నిర్ణయించారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -