Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది

రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది

- Advertisement -

దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దు
తుంగతుర్తి వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
నవతెలంగాణ – నూతనకల్
వాన కాలపు సీజన్లో రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పాటు సన్న వరి ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ కూడా చెల్లిస్తుందని రైతులు తలారుల చేతిలో మోసపోవద్దని అన్నారు కొనుగోలు కేంద్రానికి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులు సూచించిన నియమాలను పాటించాలని రైతులకు సూచించారు.

కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తెస్తే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్పర్సన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో పి సునీత, ఏపిఎం వెంకట్ రెడ్డి, సీసీ సునీత, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లానాయకులు గుగులోతు కృష్ణ నాయక్,  మండల నాయకులు చురకంటి చంద్రారెడ్డి, భూ రెడ్డి మధు, రైతులు ఇమ్మారెడ్డి దామోదర్ రెడ్డి, కొల్లు జనార్ధన్ రెడ్డి, బయ్య గంగయ్య, దుండిగళ్ల బిక్షం, ఐకెపి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -