Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం చేయూతనిస్తుంది

నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం చేయూతనిస్తుంది

- Advertisement -

 నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండలం లోని పిప్రీ గ్రామ సంఘం ఆధ్వర్యంలో గుప్పెడు పప్పును సేర్ప్ సీఈవో మేడం ఆదేశాలనుసారం నిరుపేద మహిళా కుటుంబాలకు అధ్యక్షురాలు లక్ష్మి పంపిణీ చేశారు. ఈరోజు గ్రామ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇందిరా మహిళల శక్తి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా సీసీ గడాల రఘుపతి మాట్లాడుతూ .. సంఘంలో లేని నిరుపేద మహిళలు సంఘంలో చేరాలని, అలాగే 15 సంవత్సరాలు నిండిన మహిళలని కూడా సంఘంగా ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు.

తద్వారా ప్రభుత్వం నుండి మహిళలకు మంచి పథకాలు, ఫలాలు అందుకునే అవకాశం లభిస్తుందని వివరించారు. అలాగే 60 సంవత్సరాలు నిండిన మహిళల చేత కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వికలాంగుల సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా తయారు చేసిన సంఘాలకు ప్రభుత్వం రివార్డింగ్ పండ్ ఇస్తుందని, నిరుపేద మహిళా కుటుంబాలకు సేర్ప్ మేడం ఆదేశానుసారం గుప్పెడు పప్పు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రెండు కుటుంబాలకు గుప్పెడు పప్పును అందజేయడం జరిగింది. ప్రతి పనిలోను మహిళలు ముందుండాలని పేర్కొన్నారు. సేర్ప్ ద్వారా నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మహిళలు ముందుండాలని, అలాగే ప్రభుత్వం మహిళలకి చేయూతనందించాలనాదే ప్రధాన లక్ష్యం అని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు, కార్యదర్శి వివో ఏలు నిరోష, విశాల గ్రామ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -