భారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే, డిఎఫ్ఓ..
లారీలో ప్రయాణించిన ఎమ్మెల్యే బొజ్జు..
నవతెలంగాణ – జన్నారం
ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం కవ్వాల్ అభయారణ్యంలోకి భారీ వాహనాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో తపాలాపూర్ చెక్పోస్ట్ వద్ద భారీ వాహనాలకు ఎఫ్డిఓ శివ్ ఆసీస్ సింగ్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అదే భారీ వాహనంలో తపాలాపూర్ చెక్పోస్ట్ నుంచి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రయాణించారు. సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
2013లో భారీ వాహనాల రాకపోకలపై నిషేధించడంతో జన్నారం కడెం ఇంద్రవెల్లి ఉట్నూర్ దస్తురాబాద్ తదితర మండలాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయన్నారు. నేటితో ఆ భారీ వాహనాల రాకపోకలపై ఉన్న నిషేధం పూర్తిస్థాయిలో తొలగిందన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి అన్నారు. అందుకు కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇది ఇక్కడి ప్రజల విజయం అన్నారు.
స్పీడు 30 దాటితే చర్యలు తప్పవు డీఎఫ్ఓ..
భారీ వాహనాలు అభయారణంలోకి ప్రవేశించినప్పుడు 30 కంటే స్పీడు దాటితే చర్యలు తప్పవని డీఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్ అన్నారు.. అధికంగా స్పీడ్ వెళ్తే అడవిలో ఉన్న జంతువులకు ప్రమాదం జరుగుతుందన్నారు. అది దృష్టిలో పెట్టుకొని వాహనాలు స్వీట్ లిమిట్ తో వెళ్లాలన్నారు. వన్యప్రాణులకు ప్రమాదం జరగకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలపండి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిపాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. గత ప్రభుత్వాలు పేద ప్రజలకు ఏమీ చేయకుంన్నా, ఇప్పుడు పేద ప్రజలను కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శిస్తున్న ప్రతిపక్ష నాయకుల మాటలు ప్రజలు నమ్మవద్దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు గంగిరెద్దుల వచ్చి సొల్లు కబుర్లు చెబుతూ ఓట్లు అడగడానికి వస్తారన్నారు అలాంటి వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని గెలిపించాలన్నారు.
వర్తక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మానం..
భారీ వాహనాల రాకపోకల నిషేధం ఎతివేయడంతో అందుకు కృషి చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు వర్తక సంఘం ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్, ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు ముజాఫర్ అలీ ఖాన్ మేకల మాణిక్యం ఏఎంసి వైస్ చైర్మన్ ఫసియుల్లా, నాయకులు మోహన్ రెడ్డి సుభాష్ రెడ్డి, మామిడిపల్లి ఇందయ్య దుమల రమేష్, ఇసాక్ అక్కిలినేని రాజశేఖర్, రియాజుద్దీన్, మహమ్మద్ అజారుద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీష్, డైరెక్టర్ ప్రదీప్ లకావత్ తిరుపతి మొజ్జు షాకీర్ సత్యనారాయణ చంద్రయ్య, వర్తక సంఘం అధ్యక్షుడు వామన్, సోహెల్సా అజ్మత్ ఖాన్, వివిధ సంఘాల నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.