ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లను దశల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ స్వాగతించింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. రజనీకాంత్, టి నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఆరేండ్లుగా సుమారు రూ.8,200 కోట్లు స్కాలర్ షిప్‌లు, ఫీజురీయింబర్స్ మెంట్ పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బంద్ నిర్వహిస్తామని కళాశాల యజమాన్యాలు ప్రకటించడంతో ప్రభుత్వం చర్చలు జరిపిందని పేర్కొన్నారు. రూ. 600 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. గతంలో కూడా ప్రభుత్వం ఈ తరహాలో అనేక ప్రకటనలు చేసిందని గుర్తు చేశారు. ప్రకటనలు కాకుండా పూర్తిస్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ప్రకటన హర్షణీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES