పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – మణుగూరు
ప్రతి అర్హుడుకి సొంతిల్లు, ప్రతి కుటుంబానికి సంతోష్ అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పాత్రలను అందజేశారు. పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి అర్హుడికి గృహం, ప్రతి కుటుంబానికి సంతోషం అందించడం రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అన్నారు. గృహం అనేది ప్రతి మనిషి మౌలిక హక్కు అన్నారు. అందుకే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నాము అని పేర్కొన్నారు. మంజూరు పత్రాలు స్వీకరించిన లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కి మరియు స్థానిక ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల నరేష్ ఎంపీపీడీఓ శ్రీనివాసరావు ఎంపీ ఓ వెంకటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శులు ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికి సంతోషం అందించడమే ప్రభుత్వ లక్ష్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES