Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేదల కండ్లలో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

నిరుపేదల కండ్లలో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

– కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి సునీల్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
నిరుపేదలకు ఇండ్లు కట్టించి వారి కళ్ళలో ఆనందం చూడాలన్నదే కాంగ్రెస్  ప్రభుత్వ లక్ష్యమని  కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి సునీల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఉప్లూర్ గ్రామంలో నిర్మాణం పూర్తయిన  నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని లబ్ధిదారు మేడిపల్లి రాణి రాజేష్ దంపతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి, లబ్ధిదారు మేడిపల్లి రాణి రాజేష్ దంపతుల చేత   నూతన గృహ ప్రవేశం చేయించారు.

ఈ సందర్భంగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇండ్లు కట్టించి వారి కళ్ళలో ఆనందం చూడాలన్నదిిి లక్ష్యమన్నారు. పేద ప్రజల స్వంత ఇంటి కళ నిజం చేయాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణ పథకం విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు.రానున్న రోజుల్లో అర్హులైన ప్రతిఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని, ఇల్లు లేని పేదలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు.

నూతన గృహ ప్రవేశం చేసిన మేడిపల్లి రాణి రాజేష్ దంపతులకు హార్థిక శుభాకాంక్షలు తెలిపి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, ఉప సర్పంచ్ తక్కురి రాజశేఖర్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -