Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్బిసి రిజర్వేషన్ బిల్లులను గవర్నర్ వెంటనే ఆమోదించాలి..

బిసి రిజర్వేషన్ బిల్లులను గవర్నర్ వెంటనే ఆమోదించాలి..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
గవర్నర్ బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదింప చేయాలని, బిసి కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య అన్నారు. గురువారం జన్నారంలో పత్రికా విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, పురపాలికలు, నగరపాలక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేస్తూ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ పురపాలక చట్టాల సవరణ బిల్లులు రెండింటిని రాష్ట్ర ప్రభుత్వము  మంగళవారం  రాజభవన్ కు పంపించిందన్నారు. 

ఆదివారం శాసనసభలో సోమవారం శాసనమండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందాయన్నారు. వీటిని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  ఆమోదం కోసం మంగళవారం ఉదయం రాజ్ భవన్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపించిందన్నారు. సోమవారం ఉదయమే రాష్ట్ర మంత్రులు అఖిలపక్ష నేతల బృందం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ని కలిసి బిల్లులను ఆమోదించాలని ప్రత్యక్షంగా కలిసి కోరడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్  వద్దకు చేరిన రెండు బిల్లులపై న్యాయ సలహా తీసుకోవాలని గవర్నర్  నిర్ణయించినట్లుగా తెలుస్తోందన్నారు.

 వెంటనే గవర్నర్ బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కడార్ల నర్సయ్య , మూల భాస్కర్ గౌడ్  మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ  కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad