Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైభవంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన..

వైభవంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన..

- Advertisement -

వేడుకలలో పాల్గొన్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి..
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని కొట్రా గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ  చెన్నకేశవ విగ్రహ , ధ్వజస్తంభ ప్రతిష్టాపన  కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హోమం నిర్వహించి లక్ష్మీ చెన్నకేశవ విగ్రహాల ప్రతిష్టాపన,   ధ్వజస్తంభ కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. వేడుకలలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ భక్తి భావం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి  పూలమాలలు వేసి శాలువా కప్పి  ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవి యాదవ్,  నాయకులు సురేందర్ రెడ్డి, వెంకటయ్య గౌడ్, జంగయ్య యాదవ్, రవీందర్ రావు ,శ్రీనివాస్ యాదవ్,  నిర్వాహకులు,  ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.పూజల్లో మాజీ ఎమ్మెల్యే..శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ యాదవ్ , యాదగిరి,  ఆనంద్, గణేష్ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -