- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని భూపాలపల్లి-పెద్దపల్లి రెండు జిల్లాల సరిహద్దుల్లోని మానేరు ప్రక్కన సందరెల్లి పురాతన ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వేదపండితులచే అంగరంగవైభవంగా ఆలయ చైర్మన్ ఇందారపు లక్ష్మీ, వైస్ ఛైర్మన్ చిలుక రాధిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి ఖమ్మంపల్లి, తాడిచెర్ల, అడవిశ్రీరాంపూర్, ఓడేడ్, ముత్తారం, శితంపల్లి, ధర్మారం, బిత్తివేల్లి, మంథని, మల్లారం తదితర గ్రామాల నుంచి వందలాది సందర్శకులు తరలివచ్చారు. ఇద్దరు మహిళలు విరవణితల్లా కళ్యాణ మహోత్సవం నిర్వహించడపై పలువురు అభినందించారు. అంతకముందు శివలింగానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Advertisement -



