నేటితరం యువతకు స్పూర్తి ప్రదాత
స్వామి వివేకానంద జయంతి వేడుకలు
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ కార్యాలయం లో నేడు స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వివేకానంద చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువి ఫౌండేషన్ ఫౌండర్ సుజన్ కుమారు మాట్లాడుతూ.. భారత దేశ ఔనత్యాన్ని ప్రపంచ దశ దిశల చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు.
12 జనవరి న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని అలాగే సేవ బావలను పెంపొందించే ప్రత్యేకమైన రోజుగా తెలిపారు. వివేకానంద ఆశయాలను ఆచరిస్తూ ఆయన స్ఫూర్తితో మెలగాలని అన్నారు. అనంతరం ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ అధ్యక్ష కార్యదర్శి మద్దుకూరి సాయిబాబు, వాల బాలకిషన్ మాట్లాడుతూ .. వివేకానంద ఆలోచనలు ఆదర్శాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తునాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మద్ది గంగాధర్ ,దర్శనం రాజు, సిర్పలింగం, ధన్పల్ రాజేష్, శ్రీను సతీష్ తదీతరులు పాల్గొన్నారు.



