Saturday, January 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగురుకుల హాస్టల్‌ డిప్యూటీ వార్డెన్‌, ప్రిన్సిపాల్‌, స్టాఫ్‌నర్స్‌ సస్పెన్షన్‌

గురుకుల హాస్టల్‌ డిప్యూటీ వార్డెన్‌, ప్రిన్సిపాల్‌, స్టాఫ్‌నర్స్‌ సస్పెన్షన్‌

- Advertisement -

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్‌ అజారుద్దీన్‌
ఫుడ్‌ పాయిజన్‌ ఘటనా బాధితులకు పరామర్శ


నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి మైనార్టీ గురుకుల స్కూల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలో హాస్టల్‌ డిప్యూటీ వార్డెన్‌, స్టాఫ్‌ నర్స్‌, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేసినట్టు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్‌ అజారుద్దీన్‌ తెలిపారు. కింగ్‌ కోఠి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శనివారం ఆయన పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంతోష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని, ఒకటి రెండ్రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతారని తెలిపారు.

హాస్టల్‌కు ఫుడ్‌ మెటీరియల్‌ సప్లై చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల అస్వస్థత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించామని అన్నారు. మంత్రి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.సంతోష్‌ బాబు, వైద్యులు సాధన, చిన్నపిల్లల వైద్యులు, గ్రేడ్‌ టు నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పద్మ, ఎల్‌టీ నరసింహారెడ్డి, షాహిదా బేగం తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -