నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమ నియమకాలను రద్దు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని సోమవారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ తెలంగాణ విశ్వ విద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి నీ కలసి, హైకోర్టు తీర్పు కాపీని అందించి, అమలు చేయాలని వినతి పత్రాన్ని సోమవారం సమర్పించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి రాజుగౌడ్ మాట్లాడుతూ 2012 అక్రమ నియమకాల రద్దు పై హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. యూనివర్సిటీ ఉన్నతాధికారులు హైకోర్టు తీర్పు కాపీ అందలేదని బుకాయించి గత 15 రోజులుగా కాలయాపన చేయడంపై మండిపడ్డారు. మీడియా, విద్యార్థి సంఘాలు నిత్యం ఈ అంశంపై ఆందోళన చేస్తూ ఉంటే వి.సి, రిజిస్టార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అక్రమార్కులకు కొమ్ము కాయడానికి అని మండిపడ్డారు. ఇప్పటికైనా యూనివర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి తక్షణం హైకోర్టు ఇచ్చిన తీర్పునీ అమలుపరిచి అక్రమ నియమాకులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హైకోర్టు తీర్పును అమలు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



