Wednesday, July 30, 2025
E-PAPER
Homeసినిమానవ్వించే 'సతీ లీలావతి'

నవ్వించే ‘సతీ లీలావతి’

- Advertisement -

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్‌ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్‌ బ్యానర్‌పై నాగమోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌ (శివ మనసులో శతి)’ ఫేమ్‌ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు.
భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్‌
టైనింగ్‌గానూ తెరకెక్కించిన ఫన్నీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్‌ మంగళవారం విడుదల చేశారు. ‘లావణ్య, దేవ్‌ మోహన్‌ జంట పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటుంది. కానీ నెక్ట్స్‌ సీన్‌లోనే దేవ్‌ మోహన్‌ను లావణ్య కొట్టి, కట్టేసుంటుంది. వారి మధ్య జరిగే గొడవకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను టీజర్‌లో మనం గమనించవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య జరిగే గొడవలో వి.కె.నరేష్‌, వి.టి.వి.గణేష్‌, సప్తగిరి, జాఫర్‌, మొట్ట రాజేంద్రన్‌ ఎందుకు ఇన్‌వాల్వ్‌ అయ్యారు. అసలు గొడవేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్‌ ప్రకారం షూటింగ్‌ పూర్తి చేసి, సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫీల్‌ గుడ్‌ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -