Saturday, November 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభార్యను కడతేర్చిన భర్త 

భార్యను కడతేర్చిన భర్త 

- Advertisement -

– తీవ్రంగా కొట్టడంతో మృతి 
నవతెలంగాణ – కట్టంగూర్
: మహిళల రక్షణ కొరకు చట్టాలు ఎన్ని చేసినా భర్తల చేతిలో భార్యలు మృత్యువాత పడుతూనే ఉన్నారు. కొంతమంది భర్తలు పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, మరి కొంతమంది మహిళలు భర్తల చేతిలోనే తనువు చాలిస్తున్నారు. అదే కోవలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ కు చెందిన నవవధువు పెళ్లయి ఏడాది గడవకముందే భర్త తీవ్రంగా కొట్టడంతో  రాత్రి అకాల మరణం చెందింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని పరడా గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన వేముల మారమ్మ, శంకరయ్య(లేట్) దంపతుల మూడవ కూతురు సుమలత(30)ను మండలంలోని పరడ గ్రామానికి చెందిన పరడ ఎల్లయ్య, నర్సమ్మ కొడుకైన పరడ మహేష్ కు ఇచ్చి డిసెంబర్ 6, 2024న వేములకొండ గుట్ట వద్ద వివాహాం చేశారు.

మహేష్ శనివారం ఉదయం తన అత్తగారైన మారమ్మకు, బంధువులకు ఫోన్ చేసి నీ కూతురిని దెబ్బలు కొట్టడంతో చనిపోయిందని, వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లమని సమాచారం ఇచ్చి పరారయ్యాడు. దీంతో మృతురాలి తల్లి 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత మృతురాలి తల్లి తన బంధువులతో కలిసి పరడ గ్రామానికి వచ్చింది. మృతురాలి శరీరంపై తీవ్ర గాయాలు, చెవిలో నుంచి రక్తం కారటం, మెడమీద పంటితో కొరికిన గాయాలు, వెన్నుపూస మీద బలంగా తగిలిన గాయాలు, కమిలిన గాయాలు ఉన్నట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొంది. మృతురాలిపై ఉన్న బంగారు నగలను అల్లుడు తీసుకెళ్లినట్లు ఆమె తెలిపింది.

మృతిరాలి భర్త పరడ మహేష్ మృతురాలిని చంపేందుకు పక్కా ప్రణాళికతో కుట్ర పన్ని అన్నదమ్ములైన పరడ మహేష్, మురళి, గిరికి సహకరించిన తల్లితండ్రులు పరడ నర్సమ్మ ఎల్లయ్యల పై చట్టరిత్యా చర్య తీసుకోవాలని మృతురాలి తల్లి వేముల మారమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మునుగోటి రవిందర్ తెలిపారు. నిందితుడికి గతంలో గ్రామానికి చెందిన మరో అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న అతని వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. కాగా ఇటీవల మహేష్ కు సుమలతతో వివాహం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -