Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మేడారంలో భక్తుల సందడి 

మేడారంలో భక్తుల సందడి 

- Advertisement -

వనదేవతలకు ప్రత్యేక మొక్కలు 
నవతెలంగాణ – తాడ్వాయి 
: మేడారం సమ్మక్క సారలమ్మ ను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్గడ్ మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్న బాబు స్థాన ఘట్టాల వద్ద బ్యాటరీ వద్ద పుణ్య స్థానాల ఆచరించి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సరే ఒడి బియ్యం ఎత్తు బంగారం సమర్పించి ప్రత్యేకమొక్కులు చెల్లించారు. పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, ఎండోమెంట్ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో సకల సౌకర్యాలు కల్పించారు. వనదేవతలకు సులభంగా దర్శనమయ్యే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తులు మొక్కులు అనంతరం దగ్గరలోని అటవీ ప్రాంతానికి వెళ్లి వంటావార్పు చేసుకుని విందు భోజనాలు ఆరగించారు. అనంతరం ఎవరి ఇళ్లల్లోకి వారు సురక్షితంగా వెళ్ళిపోయారు. కాగా వర్షం కురుస్తున్న భక్తులు అధిక సంఖ్యలో వనదేవతల దర్శనానికి రావడం విశేషం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img