- Advertisement -
పూజలలో పాల్గొన్న చందుపట్ల సుజాత సాయి తిరుపతి రెడ్డి
నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని 15వ వార్డులో వినాయక నవరాత్రుల సందడి కొనసాగుతోంది. మంగళవారం వార్డ్ కౌన్సిలర్ చందుపట్ల సుజాత సాయి తిరుపతి రెడ్డి హిందూ వాహిని సీపీఐ గల్లి, రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గజానన మండపాలలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రజకవాడలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో కూడా భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ వార్డు ప్రజలు ఆరోగ్య సౌఖ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో వార్డు ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
- Advertisement -