Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్శివాజీ బీడీ సెంటర్ ను మార్చాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలి..

శివాజీ బీడీ సెంటర్ ను మార్చాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలి..

- Advertisement -

తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

చందుర్లో ఉన్న శివాజీ బీడీ సెంటర్ ను మార్చాలని ఆలోచనను యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ జిల్లాలో లేబర్ కార్యాలయం లో అధికారులకు వినతి పత్రం అందించారు. వారు సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. శివాజీ బీడీ మహిళ ప్యాకర్స్ లు గత 14 సంవత్సరాల నుండి మహిళా బీడీ ప్యాకర్స్ కార్మికులు అందులో పనిచేస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో బీడీ యజమాన్యం ప్యాకింగ్ సెంటర్ ను చెందూరు నుండి కుర్నాపల్లికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు.

చందూరు కు చెందిన మహిళ బీడీ ప్యాకర్స్ కార్మికులు కుర్నాపల్లి కి వెళ్లడానికి అనే కాటంకాలు వస్తున్నాయి బస్సు సౌకర్యం లేదు ఆటో కట్టుకొని వెళ్తే వచ్చే కూలి కూడా ఆటోకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బీడీ ప్యాకర్స్ కార్మికులు ఉపాధి లేక మహిళ బీడీ ప్యాకర్స్ కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి ఇందులో పనిచేసే కార్మికులు14 సంవత్సరాలు చేసిన సర్వీసు కనీసం యజమాన్యం దృష్టిలో పెట్టుకొని చందూర్లో కొనసాగించాలని సబ్లే వాగేరే అండ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ శివాజీ జిఎం కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యజమాన్యానికి తెలియజేస్తామని వారితో మాట్లాడి చర్చించి చెప్తామని చెప్పడం జరిగింది. కానీ జీఎం  ఇప్పటివరకు చర్చకు పిలువలేదు సమస్య పరిష్కారం చేయలేదు సమస్యను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నూర్జహాన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోసిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు,  రేఖ, విజయ, ఉష, భారతి, అనిత, జ్యోతి, అభిజ్ఞ, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad