– అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ చైర్మెన్ కెకె.రాజా
– సామాజిక ఉద్యమాల్లో అగ్రగామిగా ‘కేవీపీఎస్’
– కేవీపీఎస్-2026 క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహనీయుల ఆదర్శాలను నేటితరం ఆచరించాలని, వారి ఆశయాలను సాధిం చే దిశగా ముందుకు సాగాలని ప్రముఖ అంబేద్కర్‌వాది, అభ్యుదయ ఆర్ట్స్ అకా డమీ చైర్మెన్ కెకె.రాజా అన్నారు. హైదరా బాద్‌లోని ఆదర్శనగర్ ఎగ్సోటిక్ ఈవెంట్స్ హాల్‌లో బుధవారం కేవీపీఎస్ 2026 సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్క రించారు. అనంతరం మాట్లాడుతూ.. 28 ఏండ్ల సామాజిక ఉద్యమ ప్రస్థానంలో కేవీపీఎస్ తనకంటూ ప్రత్యేకతను చాటు కుందన్నారు. కుల వివక్ష, అంటరానితనం పై ప్రభుత్వంతో పోరాడి చట్టాలను సాధిం చడంలో సంఘం ముఖ్యమైనపాత్ర పో షించిందని చెప్పారు. సామాజిక ఉద్యమ ప్రస్థానంలో కేవీపీఎస్ ఒక వేగుచుక్కలా నిలిచిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు అన్నారు. దేశంలో, రాష్ట్రంలో నేటికీ దళితులు సామాజిక పీడన, ఆర్థిక దోపిడికీ గురవు తున్నారని, వారికి అండగా నిలిచే పోరాటాల్లో కేవీ పీఎస్ అగ్రభాగాన నిలుస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సుందరయ్య పార్క్ వాకర్స్‌క్లబ్ మాజీ ప్రెసిడెంట్ సలి పెల రమేష్‌రెడ్డి, కేవీపీఎస్ నగర కార్యదర్శి బి.సుబ్బా రావు, మాజీ నగర కార్యదర్శులు జి.రాములు, కె.విజరు కుమార్, నాయకులు బి.పవన్, శివుడు పాల్గొన్నారు.
మహనీయుల ఆదర్శాలు ఆచరణీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



