పోస్టర్ల ఆవిష్కరణ..
తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జేపీ గంగాధర్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఈనెల 7న ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జేపీ గంగాధర్ అద్వర్యంలో పోస్టర్లను ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు 50వేల మంది పనిచేస్తున్నారని, వీరిక ఎటువంటి గుర్తింపు ఇప్పటి వరకు లేదన్నారు. ఇదే కాకుండా ఇంత కష్టపడి పని చేసే కార్మికులకు ప్రభుత్వం పర్మినెంట్ చేయకుండా కాలయాపన చేయడం అవివేకమన్నారు.
ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, జీతాలకు గొర్రె తోకతో ముడి అన్నట్టు కార్మికులు బతుకులు ఉన్నాయన్నారు.కోట్లడిసాధించుకున్న జీతాలు 9 500 వేతనం సరైన సమయంలో అందడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచిన ఇప్పటిదాకా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని దానికోసమే ఈ నెల 7 న రాష్ట్ర సదస్సు ఉంటుందని దీనిని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జేపీ గంగాధర్ పిలుపు ఇచ్చారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమం లో దుబ్బాక మోహన్, లక్ష్మణ్ ,గంగరాజం, రామయ్య, శివానందం, ఎన్ శామ్సన్ తదితరులు ఉన్నారు.
7న ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సదస్సు విజయవంతం చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES