Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పెంచిన బస్సు పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలి

పెంచిన బస్సు పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలి

- Advertisement -

పి డి ఎస్ యు, పి వై ఎల్
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
: పెంచిన బస్సు పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలను విద్యార్థులకు ఇచ్చి అధికారంలోకి రాగానే హామీలను నిర్వచకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. అలాగే  రాష్ట్రంలో అధిక శాతం విద్యార్థులు వారి కళాశాలలకు పాఠశాలకు రావడానికి ఉపయోగించే బస్సు పాస్ చార్జీలను పెంచి విద్యార్థుల పైన భారం వేయడమంటే విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసి విద్యకి దూరం చేయడమే అని  అన్నారు. మహాలక్ష్మి పథకం మహిళలకు బహుమతి అని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలోని విద్యార్థులు కనబడడం లేదా అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత  జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు వరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా కెసిఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నడుస్తుందని అన్నారు. ఈ రోజుకి కనీసం రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు అంటేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థుల పైన ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని వారు తెలిపారు. తక్షణమే పెంచిన బస్సు పాస్ చార్జీలను తగ్గించి విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు) ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్)లుగా డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad