Thursday, December 18, 2025
E-PAPER
Homeజాతీయంబీమాబిల్లుతో ఎల్‌ఐసీ వంటి సంస్థలు కుదేలు

బీమాబిల్లుతో ఎల్‌ఐసీ వంటి సంస్థలు కుదేలు

- Advertisement -

సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐలు అనుమతించే సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో ఎల్‌ఐసీ వంటి సంస్థలు కుదేలవుతాయని సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ అన్నారు. రాజ్యసభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దేశీయ సంస్థలపై ‘వినాశకరమైన’ ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. విదేశీ కంపెనీలకు బీమా రంగాన్ని తెరవడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ”ఈ రోజు రూపాయికి ఏమైంది? ఎఫ్‌డీఐ లేదు.

భారతదేశంలోని మీ (ప్రధాని మోడీ) స్నేహితులు (అదానీ, అంబానీ) కూడా వేరే చోట పెట్టుబడి పెడుతున్నారు. ఈ బీమా ప్రారంభంతో విదేశీ కంపెనీలు వస్తాయని అనుకుంటున్నారు. ఇది తప్పు ” అని బ్రిట్టాస్‌ అన్నారు. ఇప్పటికే ఎఫ్‌డీఐ అనుమతించిన రంగాల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసినప్పటికీ, అనుభవాలు ఉన్నప్పటికీ, మోడీ సర్కార్‌ మళ్లీ మళ్లీ అలానే చేయడం, తమ విదేశీ శక్తులను ప్రోత్సహించి లబ్ది పొందడానికేనని తెలిపారు. ”చాలా విదేశీ కంపెనీలు నిష్క్రమిం చాయి. తొమ్మిది విదేశీ కంపెనీలు ఇప్పటికే భారత బీమా మార్కెట్‌ నుంచి నిష్క్రమించాయి” అని బ్రిట్టాస్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -