Thursday, January 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆ జడ్జి వయసు 92 ఏండ్లు

ఆ జడ్జి వయసు 92 ఏండ్లు

- Advertisement -

మదురోను విచారిస్తున్న అల్విన్‌ హెల్లర్‌స్టెయిన్‌
న్యూయార్క్‌ :
అమెరికా చెరలో ఉన్న వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో కేసును విచారిస్తున్న న్యాయ మూర్తి అల్విన్‌ హెల్లర్‌స్టెయిన్‌ వయసు ఎంతో తెలుసా? అక్షరాలా 92 సంవత్స రాలు. అమెరికాలో వృద్ధాప్యంలో ఉన్న అనేక మంది న్యాయమూర్తులు ఎందుకు పదవిలో కొనసాగుతున్నారన్న ప్రశ్న ఎదురవడం సహజమే. అమెరి కాలో జీవితకాల న్యాయ నియామకాలు 30 లేదా 40 సంవత్సరాలు ఉంటాయి. ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకారం ఫెడరల్‌ జడ్జి సగటు వయసు 69 సంవత్సరాలు. పదవీ విరమణ చేయాల్సిందిగా న్యాయమూర్తులను కోరడానికి అమెరికాలో ఎలాంటి స్పష్టమైన యంత్రంగం లేదు. మదురో కేసును విచారిస్తున్న హెల్లర్‌స్టెయిన్‌ ఫెడరల్‌ బెంచ్‌లో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్‌ 11 దాడులు, సుడానీస్‌ మారణహోమం క్లెయిములు, దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో సంబంధమున్న కేసులను ఆయన విచారించారు. తాజాగా ఓ విదేశీ నేతపై వచ్చిన ఆరోపణలను విచారించబోతున్నారు.
మదురో ఆంతరంగికుల కేసులను కూడా హెల్లర్‌స్టెయిన్‌ విచారిస్తున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై 2024 ఏప్రిల్‌లో వెనిజులా రిటైర్డ్‌ ఆర్మీ జనరల్‌ క్లివర్‌ ఆల్కల్‌కు ఆయన 21 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించారు. వెనిజులా మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ హ్యూగో కార్వాజెల్‌కు ఫిబ్రవరి 23న శిక్ష విధించబోతున్నారు. అమెరికా రాజ్యంగం ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిలు సహా ఫెడరల్‌ జడ్జిలు జీవితకాల నియామకాలు పొందవచ్చు. రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా జడ్జిలు స్వతంత్రంగా వ్యవహరించేందుకు వీలుగా రాజ్యాంగం ఈ రక్షణ కల్పించింది. అమెరికాలో న్యాయమూర్తులకు పదవీవిరమణ తప్పనిసరి కాదు. ఎంతకాలం కోరుకుంటే, ఎంతకాలం చేయగలిగితే అంతకాలం విధులు నిర్వర్తించవచ్చు. తీవ్రమైన దుష్ప్రవర్తన కారణంగా అభిశంసనకు గురయినప్పుడు ఈ వెసులుబాటు ఉండదు. పదిహేను సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొన్న వారు పూర్తిగా పక్కకు తప్పుకోకుండానే 65 సంవత్సరాల వయసు నుంచి ‘సీనియర్‌ హోదా’ పొందవచ్చు. వారికి పూర్తి వేతనాలు లభిస్తాయి. కానీ కేసుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఫలితంగా నూతన నియామకాలకు అవకాశం లభిస్తుంది. అయినప్పటికీ చాలా మంది న్యాయమూర్తులు క్రియాశీలకంగా ఉండేందుకే ఇష్టపడతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -