Thursday, November 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మికుల గొంతుపై లేబర్‌ కోడ్‌ల కత్తి

కార్మికుల గొంతుపై లేబర్‌ కోడ్‌ల కత్తి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఇబ్రహీంపట్నం మెహక్‌ కంపెనీ కార్మికులతో ముఖాముఖి
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల గొంతులపై లేబర్‌ కోడ్‌ల కత్తి పెడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. నాలుగు లేబర్‌ కోడ్‌ల అమలు ఉత్తర్వులను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మెహక్‌ కంపెనీలో పని చేస్తున్న కార్మికులను జాన్‌వెస్లీ కలిశారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. పని ప్రదేశంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను కుదిస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌లుగా తీసుకొచ్చిన అంశాన్ని వారి దృష్టికి తెచ్చారు. ఫలితంగా కార్మికులకు జరిగే నష్టాన్ని వివరించారు. కంపెనీల యాజమాన్యాల పక్షాన తీసుకొచ్చిన ఈ కోడ్‌ల వల్ల కార్మికులు ఏ విధంగా నష్ట పోతున్నారో వివరించారు. ఐదేండ్లుగా ఈ లేబర్‌ కోడ్‌లను అమలు చేయాలని చూస్తున్న మోడీ సర్కార్‌ కార్మికుల ఆగ్రహ జ్వాలలతో వెనుకడుగు వేసిందన్నారు. బీహార్‌లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతోనే ఎన్డీఏ ప్రభుత్వం కార్పొ రేట్‌ అనుకూల విధానాల అమలు మరింత వేగవంతం చేసిం దని తెలిపారు. దానిలో భాగమే ఈ లేబర్‌ కోడ్‌లను అమలు లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోడ సామెల్‌, కడిగాళ్ల భాస్కర్‌, సీఐటీయూ ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కన్వీనర్‌ ఎల్లేశ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.శంకర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -