దళిత యువకుడిది ముమ్మాటికీ పోలీసుల హత్యే..
హైకోర్టు జడ్జిచే విచారణ జరిపించాలి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ – బంజారాహిల్స్
కోదాడ పట్టణంలో దళిత యువకుని మృతి ఘటన జైభీం సినిమాను తలపించేలా ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత యువకున్ని అకారణంగా ఓ కేసులో విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లి హత్య చేశారని ఆరోపించారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ కమిషన్ ప్రత్యేక బృందంతో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేయించాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత పోలీసు అధికారులను తక్షణమే విధుల నుంచి తప్పించాలన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయని, అయితే బ్రిటిష్ కాలం నాటి ‘థర్టీ యాక్టు’ను ఉపయోగించి అధికారులు తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింహ, శివ కుమార్, వేణు పాల్గొన్నారు.
జై భీం సినిమాను తలపించేలా కోదాడ ఘటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



