- Advertisement -
కార్మికుల శ్రమతో కేంద్రం చెలగాటం
కార్పొరేట్ల మేలుకే కాషాయ పాలన
తెలుసుకోలేనంత కాలం తప్పదీ వేదన
కలం కార్మికులపై కర్ర పెత్తనం
లేబర్ కోడ్‌లతో ప్రజాస్వామ్యంపై జులుం
భావ ప్రకటనకు స్వేచ్ఛ ఎక్కడ..?
ఫోర్త్ ఏస్టేట్ కూ ఒడవని ముచ్చట
జీఎస్టీ పేరుతో మరో ఆర్థిక దోపిడీ
పాలకులకు పట్టని పేదల అర్థాకలి
వనరుల సమీకరణపేర మోసాలు
రాష్ట్రాలకు తప్పని అప్పుల భారాలు
పేరుకు మాత్రం సంక్షేమ రాజ్యం
అన్నార్థులు, అభాగ్యులకందని భోజ్యం
అసంఘటిత రంగాలకు ఏదీ క్షేమం..?
దశాబ్దాలు గడుస్తున్నా మారని జీవనం
దినదినం మన రూపాయేమో పతనం
అమెరికా డాలర్లతో భారత్‌పై ఆధిపత్యం
విశ్వగురువు మోదీ ఏం చేస్తున్నట్లు
దిగుమతుల ప్రవాహాన్ని ఆపేదెట్లు
– సోమన్న
- Advertisement -



