Sunday, July 13, 2025
E-PAPER
Homeకవితనీకై వేచి చూసే నేల..

నీకై వేచి చూసే నేల..

- Advertisement -

నింగి నేల గాలి వానా
రేయి పగలు దినాలు వారాలు
మారిపోతూ పరాయివారిలా
నన్నిడిచి వెళ్లిపోతుంటే..
నెలలు నెమ్మదిగా మారుతున్న
వారాలు గారాలు పోతున్న
దినాలు జ్ఞాపకాల బాణాలై
నా సున్నిత హదయాన్ని గుచ్చుకుంటున్నా..
ఈ పచ్చటి ప్రకతి
నీ జ్ఞాపకాల జీవనశతియై
నీ మాటలధతి నా హదయగతిని
మార్చేసింది..
నీ పాదాల అలికిడి
ఆగమనం సవ్వడి
ఎడతెగని ముచ్చట్ల సందడి
ఈ ఎదను ప్రశాంతంగా ఉండనివ్వనట్లేదు..
ఎందరిలో ఉన్న ఈ మది పందిరిలో
కొలువై ఉన్నది నువ్వే గదా..
జీవన ప్రస్థానంలో ఎందరి ఆస్థానాల్ని
సందర్శించినప్పటికి నా గమ్యస్థానం నువ్వే..
నా రాకకై అందరూ ఎదురుచూస్తుంటే
నేను నీ రాకకై వేయికళ్లతో ఎదురుచూస్తుంటా
వచ్చిపోయే వర్షంలా నువ్వుంటే
నీ రాకకై నిత్యం వేచి చూసే నేలలా నే ఉంటా..

– సర్ఫరాజ్‌ అన్వర్‌,
9440981198

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -