Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కార్తిక మాసం చివరి సోమవారం 

ఘనంగా కార్తిక మాసం చివరి సోమవారం 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండలంలోని చల్వాయి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కార్తీక మాసం చివరి సోమవారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్వాయి శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేయడం జరిగింది ఉదయం 8 గంటల నుండి ఆలయ పురోహితులు కిరణ్ కుమార్ మరియు రాజేంద్ర చారి, క్రాంతి కుమార్  ఆధ్వర్యంలో మహా అన్నపూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. పాల్గొన్న భక్తులందరూ ఓం నమశ్శివాయ నామస్మరణల తో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులందరూ పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -