Sunday, August 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలులిల్లీపుట్ నాయకుడు నాపై విమర్శలు చేస్తున్నాడు: కవిత

లిల్లీపుట్ నాయకుడు నాపై విమర్శలు చేస్తున్నాడు: కవిత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ నేతల తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు ఎవరూ మాట్లాడలేదు అని తీవ్ర స్థాయిలో ఆవేదన చెందారు. తన మీద వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్‌లోని పెద్ద నాయకుడి కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు.. నల్లగొండలోని ఓ బీఆర్ఎస్ నాయకుడు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి నల్లగొండలో ఆయన ఒక్కడు గెలిచి మిగిలిన సీట్ల ఓటమికి కారణమయ్యాడని మండిపడ్డారు. అలాంటి లిల్లీపుట్ నేత కూడా నా మీద మాట్లాడుతన్నాడని సీరియస్ అయ్యారు. అసలు కేసీఆర్ లేకపోతే ఆ లిల్లీపుట్ లీడర్ ఎవరు? అని ప్రశ్నించారు.

అలాగే తెలంగాణలో 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వానికి, పోలీసులను అనుమతి కోరాం. ప్రభుత్వం అనుమతి విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిరాహార దీక్ష అనుమతి కోసం కోర్టుకు వెళ్ళాము.. కోర్ట్ మాకు అనుమతి ఇస్తుంది అనే నమ్మకం ఉంది. గాంధేయ మార్గంలో దీక్ష చేస్తాం. సానుకూల దృక్పథంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. 42 శాతంలో ముస్లింలు ఉన్నారో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.. ఉన్నారా లేదా స్పష్టత ఇవ్వాలి. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. దొంగనే దొంగ అన్నట్టుగా ఉంది బీజేపీ వాళ్ళ ధర్నా..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -