Sunday, October 19, 2025
E-PAPER
Homeఖమ్మంనిరుపేదల కళ్ళలో దీపావళి వెలుగులు.. 

నిరుపేదల కళ్ళలో దీపావళి వెలుగులు.. 

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
కంటి శుక్లాలతో బాధపడుతున్న ఎంతోమంది నిరుపేదలకి గత మూడు సంవత్సరముల నుండి మూడు వేల పైచిలుకు కంటి ఆపరేషన్లు చేయించి వారికి కంటి వెలుగులు ప్రసాదించటం జరిగిందని 100 పడకల ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ సునీల్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా  గత మూడు సంవత్సరముల క్రితం రేగా విష్ణు మెమోరియల్ ట్రస్టు ద్వారా పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు 409 కంటి ఆపరేషన్లు చేయించడం జరిగిందన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో  519 మరియు 1075 కేసులు, ప్రస్తుతం 500 పైచిలుకు కంటి ఆపరేషన్లు చేయించమన్నారు . ఖమ్మం  ఆసుపత్రిలో కూడా మన ఏరియా లోని కంటి శుక్లాలతో బాధపడుతున్న వారికి కంటి ఆపరేషన్లు చేయించడం జరిగిందన్నారు.

కరకగూడెం మండలంలోని మారుమూల గిరిజన గ్రామపంచాయతీ అయినటువంటి కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల నుండి 60 మందిని కంటి ఆపరేషన్ల కొరకు సెలెక్ట్ చేయడం జరిగిందన్నారు వారిలో 45 మందికి కంటి ఆపరేషన్లు చేయించి వారందరికీ ఏరియా ఆసుపత్రి మణుగూరు నందు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారందరికీ పాటించవలసిన నియమాలు, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ,మందులు వాడు విధానం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, ఆర్ఎంఓ డాక్టర్ గౌరీ ప్రసాద్, ఆప్తమిక్ ఆఫీసర్ జి సంజీవరావు తెలియజేసినారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుండి ఆదినారాయణ ప్రమోదులు మరియు ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొనినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -