Wednesday, January 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫూలే దంపతుల జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

ఫూలే దంపతుల జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డి

‘కుల నిర్మూలన కోసం జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు గొప్ప పోరాటం చేశారు. మహిళా విద్య కోసం వారు ఎదుర్కొన్న సవాళ్ళను ‘ఫూలే’ చిత్రంలో కళ్ళకి కట్టినట్లు చూపించారు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రముఖ జర్నలిస్ట్‌ పొన్నం రవిచంద్ర నిర్మించిన చిత్రం ‘ఫూలే’. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ ప్రదర్శనకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్‌, వెంకటస్వామి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

సినిమా ప్రదర్శన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ,’ఫూలే దంపతుల సమాజిక సేవాగుణం, వారి జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం’ అని తెలిపారు. ‘ఈ సినిమా భారతీయ సమాజానికి అద్భుతమైన సందేశాన్నిస్తుంది. మహిళల అభ్యున్నతి కోసం, ఆనాటి సమాజంలో ఉన్న కులవివక్ష, ఇతర ఇబ్బందులను తట్టుకుని సమసమాజం కోసం ఫూలే దంపతులు పునాదులు వేశారు. ఈ రోజు ఆ ఫలాలను, ఫలితాలనే మనం స్వతంత్ర భారతదేశంలో అనుభవిస్తున్నాం. వారు వేసిన పునాదుల మీద సాగుతూ వారి ఆశయాలను, లక్ష్యాలను సాధించడంలో మా ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో కృషి చేస్తాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

నిర్మాత, జర్నలిస్ట్‌ పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ,’ఫూలే’ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు సీఎం రేవంత్‌రెడ్డి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రెండు గంటలకు పైగా సమయం వెచ్చించి, ఈ సినిమాని వీక్షించారు. ఈ సినిమాను ప్రతి గ్రామంలోనూ ప్రదర్శించేలా అవకాశం కల్పించాలని కోరుతున్నాను. సమాజంలోని రుగ్మతలను తొలగించుకునేందుకు, అందరికీ విద్య అందించేందుకు ప్రతి ఒక్కరిలో ఈ సినిమా స్ఫూర్తిని కలిగిస్తుంది అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -