Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమోడీ పాలనలో పేదల బ్రతుకులు అస్తవ్యస్తం: సీపీఐ(ఎం)

మోడీ పాలనలో పేదల బ్రతుకులు అస్తవ్యస్తం: సీపీఐ(ఎం)

- Advertisement -

జులై 9న జరుగు దేశవ్యాప్త సమ్మెలో ప్రజలందరూ పాల్గొనాలి
ఎండి.జహంగీర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు..
నవతెలంగాణ – భువనగిరి
: మోడీ పదేళ్ల పాలనలో దేశంలో పేదల బ్రతుకులు అస్తవ్యస్థంగా మారాయని, జులై 9న జరుగు దేశవ్యాప్త సమ్మెలో ప్రజలు, వ్యవసాయ కార్మికులు, రైతులు, విద్యార్థి, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు. శనివారం స్థానిక సుందరయ్య భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి  కొండమడుగు నర్సింహ అధ్యక్షతన జరిగిన జిల్లా ప్రజాసంఘాల నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు జీవిన వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదలను, వ్యవసాయ కార్మికులను, కార్మికులను, రైతులను, విద్యార్థి, యువజనులను, మహిళలను మోసం చేసి బడా కార్పొరేట్ సంస్థలకు పచ్చ కార్పెట్ పరిచి లేబర్ కోడ్ లను, తీసుకొచ్చిందన్నారు. వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి, నూతన విద్యావిధానం పేరుతో విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కొత్త ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు. వీటన్నిటి అమలుకై జులై 9న జరుగు దేశవ్యాప్త సమ్మెలో ప్రజలు వ్యవసాయ కూలీలు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

వీరితోపాటు రైతుసంఘం జిల్లా కార్యదర్శి మాటూరు బాలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, చేతి వృతిదారుల జిల్లా కన్వీనర్ బోలగాని జయరాములు, కేవీపీస్ జిల్లా అధ్యక్ష  దుబ్బ లింగం, అన్నంపట్ల కృష్ణ, రజక సంఘం జిల్లా కార్యదర్శి వడ్డేబోయిన వెంకటేష్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి, నాయకులు, పల్లెర్ల అంజయ్య, కల్లూరి నాగమణి, కొండమడుగు నాగమణి, సిల్వేరు ఎల్లయ్య, కొండాపురం యాదయ్య, లక్ష్మీనారాయణ  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad